Satyanveshana
Chapters
ఉపహారము ೧ కం || ''సత్యాన్వేషణ'' మను భాసుర ప్రవచనము సల్పిపరతత్త్వంబున్ వాసిగ దేట తెనుంగున జేసితి కృతి భవ నిమోహజేతగ దనరన్ ೨ ఉ || శ్రీయుత విన్నకోట బుధశేఖర మాధవరాయవర్యనీ వాయత రీతి కబ్బములనబ్రముగా విరచించి తత్కృతుల్ పాయక గూర్చి యర్హులకు బంధురమైన యశోవిభూతికిన్ ధ్యేయుడనంగ మించితివి దివ్య సుభాషిత రత్నవై దుషిన్ 3 మ || జగమెల్లన్ గన స్వప్న వృత్త ఘటనాసంబంధియం చెల్లెడన్ నిగమాద్యర్ధవిదుల్ వచింప వినమే? నిక్కంబ యీమాట: యె న్నగ సత్యంబది బ్రహ్మమే యనుచు గానంగల్గినంజాలు; సెం పుగ నీ మోహభహబ్ధిలో మునుగ నే పుణ్యంబు ప్రాపించెడిన్. 4 ఉ || ఎందరొ తత్త్వశాస్త్ర విదులెన్నియొ గ్రంధముల& రచించిరే పుందగ నంచు బల్కుదురుపో! బుధపుంగవులట్లు గాక ! యీ బంధురతా విమర్శ గుణపాటవమౌ కృతి నేటి సంస్కృతీ బృందములెల్ల మెచ్చెడి విభిన్న సుభాపములన్ రహించెడిన్; ^ñ గీ || సృష్టియెల్లను నిండి విచిత్ర గరిమ సగుణ నిర్గుణముల నేక సరణి వెలుగు నట్టి పరమార్ధ మాయ నిర్యాచ్య వస్తు వెల్లపుడు నీకు నీప్సితంబిచ్చుగాత. భవన్మిత్రుడు తుమ్మలపల్లి శివరావు